
శోక సంద్రంలో సోన్
సోన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అష్టపు ప్రేమ్‌సాగర్ మృతదేహం శనివారం స్వగ్రామం చేరుకుంది. వారం రోజుల క్రితం దుబాయిలోని ఓ ప్రముఖ బేకరీలో పనిచేస్తున్న ప్రేమ్‌సాగర్‌ను పాకిస్తాన్‌కు చెందిన యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణిరెడ్డి, బీజేపీ నాయకులు సత్యనారాయణగౌడ్, అయ్యన్న గారి భూమ య్య, ముత్కపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.