పర్యాటక ఉత్సవాలకు ప్రణాళికలు
సాక్షి,పాడేరు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రత్యేక గుర్తింపు పొందిన మారేడుమిల్లి, అరకులోయ ప్రాంతాల్లో పర్యాటక ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్‌గౌడ్, ఐటీడీఏ పీవోలు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. గిరిజన యువతీయువకులకు హస్తకళలు, పర్యాటకం,ఆతిథ్య రంగాలలో తగిన శిక్షణకు ప్రతిపాదించాలన్నారు.జిల్లాలో డెస్టినేషన్ అథారిటీ ఏర్పాటు చేశామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వారపుసంతల్లో ప్లాస్టిక్ అమ్మకాల నిషేధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవోలను ఆదేశించారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా సంతల్లో గుడ్డ సంచులను విక్రయించాలే చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలపై షార్ట్ ఫిలింలు తయారు చేసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేపట్టాలన్నారు. వారపు సంతల్లో నకిలీ వస్తువులు,కల్తీ ఆహార పదార్థాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోటళ్లు లేని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు బస చేసేలా ఏర్పాట్లు చేయాలని, సాహస క్రీడలు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండాగ్రామసభలు నిర్వహించి, గిరిజనుల ఆమోదం తీసుకోవాలన్నారు. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సంబంధిత పంచాయతీలకు కేటాయించాలని ఆదేశించారు. ఏజెన్సీ సందర్శనకు వచ్చే పర్యాటకుల వివరాలను సేకరించాలన్నారు. ఈ సమావేశంలో సబ్‌కలెక్టర్ సౌర్యమన్ పటేల్, వర్చువల్‌గా ఐటీడీఏ పీవోలు కట్టా సింహాచలం, వి.అభిషేక్, అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా పర్యాటకశాఖ అఽధికారి జి.దాసు, అరకు మ్యూజియం మేనేజర్ మురళీకృష్ణ, టూరిజం కన్సల్టెంట్ రత్నరాజు పాల్గొన్నారు.
వారపు సంతల్లో ప్లాస్టిక్ నిషేధం
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment