23 తులాల బంగారం, రూ.లక్ష చోరీ
సీతమ్మధార: ఇంట్లో చొరబడి 23 తులాల బంగా బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీ ఘటన మధురానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు మీడియాకు ఆదివారం తెలిపిన వివరాలు.. మధురానగర్ జీవీఎంసీ పాఠశాల దరి అనంతమాధవి టవర్స్, ఫ్లాట్ నెం.102లో మరకాని కృష్ణ(46) కుటుంబంతో కలిసి ఏడేళ్లుగా నివాసం ఉంటున్నారు. కృష్ణ నగరంలోని అశోక్ ఆటోమొబైల్స్‌లో పనిచేస్తున్నారు. శనివారం కుటుంబంతో కలిసి కాకినాడలో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి వేసి ఉన్న తాళం కట్ చేసి ఉండటాన్ని గమనించారు. దీంతో కంగారుగా ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలో ఉన్న 23 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో బాధితులు ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో సంఘటనా స్థలికి చేరుకుని, ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్‌లో నిందితుడిని గుర్తించి, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment