కొయ్యూరు: పేదలకు సామూహిక వివాహా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దాన ధర్మ చారిటబుల్ సంస్థ సేవా ప్రతినిధి డి.ప్రసాద్, టీటీడీ ధర్మ ప్రచారక్ పద్మరాజు చెప్పారు. వారు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సామూహిక వివాహాది కార్యక్రమంలో భాగంగా వధూవరులకు నూతన వస్త్రాలు, కాలిమెట్టెలు, తలంబ్రా లు, కర్పూర, పూల దండలను సంస్థ సమకూరుస్తుందన్నారు. ఈ మేరకు అర్హలైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివాహాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు మహిళలు 18 సంవత్సరాలు దాటి, పురుషులు 21 సంవత్సరాలు నిండి ఉండాలని సూచించారు. చినజీయన్ స్వామి ఆశీస్సులతో ఏప్రిల్‌లో వివాహాలు నిర్వహిస్తా రని చెప్పారు. మరిన్ని వివరాలకు 73822 73833, 83670 82 887, 9014294500 లను సంప్రదించాలని కోరారు.
తాగునీటి సమస్య లేకుండా చర్యలు
పాడేరు: జిల్లాలో తాగునీటి సమస్యలు చేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధి కారి కె.ఎస్.జవహర్‌కుమార్ నాయుడు సోమవారం ఒక ప్ర కటనలో తెలిపారు. ప్రస్తుతం తాగునీటి ఎద్దడి లేదని, ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఎదురైతే 0893529 8900 అనేఫోన్ నంబర్‌కు కాల్‌చేసి ఫి ర్యాదు చేయాలని పేర్కొన్నారు. గత నెల 1న ప్రారంభమైన సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం కింద జి ల్లా వ్యాప్తంగా 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాల ను పరిశీలించినట్టు పేర్కొన్నారు. జిల్లా లో పీడబ్ల్యూఎస్ ప థకాలు, హ్యాండ్ పంపులు పరిశీలించి అవసరమైన వా టిని మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment