చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది
ముంచంగిపుట్టు: వైఎస్సార్‌సీపీ వాళ్లకు పనులు చేయవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలతో ఆయన నిజ స్వరూపం బయటపడిందని, వెంటనే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని విశాఖ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.ముంచంగిపుట్టులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా అందరికీ సమన్యాయం చేస్తానని ప్రమాణం చేసి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయకూడదని చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉండే అర్హత లేదన్నారు.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులం,మతం,ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు, రాయితీలు అందించారని చెప్పారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
విశాఖ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర
Comments
Please login to add a commentAdd a comment