భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
● నిమ్మలపాలెంలో రోడ్డు ప్రమాదం ● అదుపు తప్పిన ద్విచక్ర వాహనం ● భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
కొయ్యూరు: డౌనూరు పంచాయతీ నిమ్మలపాలెం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతపల్లి మండలం వేనంకు చెందిన పాంగి భానుచందర్ (45) మృతి చెందాడు. ఆయన తన స్వగ్రామం నుంచి డౌనూరు మీ సేవ కేంద్రానికి భార్య జ్యోతితో కలిసి బైక్‌పై వస్తున్నారు. అయితే నిమ్మలపాలెం గ్రామం వద్ద వాహనం అదుపుతప్పింది. దీంతో భానుచందర్ కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఘటన జరిగిన ప్రాంతంలోనే ఆయన మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. భార్య జ్యోతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికులు 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందడంపై ఆమె గుండెలవిసేలా రోదించారు. ఆమెను చూసి స్థానికులు కంటతడిపట్టారు. ఈ సంఘటనపై కొయ్యూరు ఎస్‌ఐ కిషోర్‌వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment