
చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గుచేటు
పాడేరు రూరల్: వైఎస్సార్‌సీపీ వాళ్లకు పనులు చేయవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి పనులు చేసినా సహించేది లేదని చెప్పడం సీఎం చంద్రబాబునాయుడు తగదన్నారు. జగనన్న ప్రభు త్వ హయాంలో పార్టీలకు, కులమతలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చి సుపరిపాలన చేశారని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం పిచ్చి చేష్టలు చేస్తు కాలం గడుపుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గడ్డుకాలం మొదలైందని, ప్రజలందరూ చమరగీతం పాడతారని చెప్పారు.
పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment