అటవీశాఖ అధికారులకు ఎస్టీ కమిషన్ చైర్మన్ సూచన
విజయనగరం అర్బన్: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చిన్నకోనల గిరిశిఖర గ్రామ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు సహకరించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డి.వి.జి. శంకరరావు కోరారు. రోడ్డు పనులను అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారంటూ గిరిజనుల నిరసన తెలపడంపై ఆయన సోమవారం స్పందించారు. నాన్ షెడ్యూల్ ఏరియాలోని రొంపల్లి పంచాయతీ పరిధి కొండశిఖర గ్రామాలైన చిన్నకోనల, భూరిగా, వనిజతో పాటు ఎన్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని మరో ఐదు గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణంపై అటవీశాఖ అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేయాలని సంబంధిత అధికారులను కోరారు. గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనపై అలసత్వం వహించరాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment