‘స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి’
పాడేరు : వైఎస్సార్‌సీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని, తక్షణమే వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. పాడేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే మైకులు ఇవ్వలేని పరిస్థితుల్లో స్పీకర్ ఉన్నారని, అలాంటప్పుడు సమస్యలను లేవనెత్తుతారన్నారు. అసెంబ్లీను వాకౌట్ చేసి మీడియా సమక్షంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై తమ గొంతును వినిపిస్తున్నారన్నారు. నిత్యం ప్రజలతో ఉండి సమస్యలను అడిగి తెలుసుకొని అధికారుల దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అసెంబ్లీకి హాజరు కాలేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ అయ్యన్నపాత్రుడు దళిత ఎమ్మెల్యేలపై చాలా అవమానకరంగా మాట్లాడి కించపరిచారన్నారు. స్పీకర్ వాఖ్యలను గవర్నర్ సుమోటగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అద్యక్షుడు శరభ సూర్యనారాయణ, నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment