పెదబయలు: దేశానికి దిశా నిర్ధేశం చేసే పార్లమెంట్‌లోనే ప్రొటోకాల్‌ను పాటించకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యమైనట్టు కాదా? అని సర్పంచ్‌ల ఫోరం పెదబయలు మండల అధ్యక్షుడు కాతారి సురేష్‌కుమార్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విలువలు పాటించాల్సిన పార్లమెంట్‌లోనే అరకులోయ ఎంపీ గుమ్మా తనూజరాణిని ఎన్డీఏ ప్రభుత్వం అగౌరవపరిచిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి అరకులోయ ఎంపీ తనూజరాణిని ఆహ్వానించకపోవడం.. కేవలం ఆమెకు జరిగిన అన్యాయంగా లేదా వైఎస్సార్‌సీపీ నేతల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహించిన తీరు గానో భావించకూడదన్నారు. ఇది యావత్ గిరిజన జాతిని చులకనగా చూస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఓట్ల రాజకీయం కోసమే గిరిజనులకు మేలు చేస్తున్నామని చెబుతున్నారే తప్ప, అధికారం వచ్చిన తర్వాత వారి పట్ల ఎంత వక్రబుద్ధి ఉందో అర్థం అవుతుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికై నా ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
అరకులోయ ఎంపీకి ఢిల్లీలో దక్కని గౌరవం
ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సురేష్‌కుమార్ ధ్వజం