ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకర ఉత్పత్తులు
తుమ్మపాల : ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్ అధికారి సిహెచ్.లచ్చన్న అన్నారు. పట్టణంలో జీవీఎంసీ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాచురల్ ఫార్మింగ్ వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, ఆకుకూరలు స్టాల్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఉత్పత్తులను వినియోగించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా, బీపీ షుగరు గుండుపాటి వంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి వర్మ, జిల్లా కోఆర్డినేటర్ గోవింద్, మార్కెటింగ్ మాస్టర్ ట్రైనర్ అప్పలరాజు, మోడల్ మేకర్స్, పకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment