పరీక్ష కేంద్రాల తనిఖీ
అడ్డతీగల: అడ్డతీగలలోని రెండు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.ఈ పరీక్ష కేంద్రంలో 187 మందికిగాను 186 మంది పరీక్షకు హాజరయ్యారని డీఈవో తెలిపారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.ఇక్కడ పూర్తి స్థాయిలో 177 మంది విద్యార్థులు హాజరైనట్టు చెప్పారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఇన్విజిలేటర్లు, ఇతర పరీక్షల పర్యవేక్షకులకు సూచించారు.ఎంఈవో పి.శ్రీనివాసరావు తదితరులు డీఈవో వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment