కూనవరం: మండల పరిధి లోని వాల్‌ఫర్డ్‌పేట, కొండ్రాజుపేట, పంద్రాజుపల్లి, కూళ్లపాడు గ్రామాల్లో ఈ నెల 26వ తేదీ ఉదయం 11.00 గంటలకు ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభలు నిర్వహించనున్నట్టు చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సోమవారం తెలిపారు. ఫేజ్ 1బీలో ముంపునకు గురవుతున్న 10 గ్రామాలకు గాను బుధవారం పైన పేర్కొన్న నాలుగు గ్రామాల్లో సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభల్లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వివరాలు, భూమికి భూమి, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు భూమి కేటాయింపు తదితర అంశాలను వివరించనున్నట్టు పేర్కొన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పొందేందుకు అర్హుల, అనర్హుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అదే గ్రామసభల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అర్జీ సమర్పించవచ్చన్నా రు. ఆయా గ్రామస్తులందరూ సభల్లో పాల్గొనాలని పీవో కోరారు. వచ్చే వారం మిగతా మండలాల్లో ముంపునకు గురవుతున్న గ్రామా ల్లో కూడా గ్రామసభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటీడీఏ పీవో తెలిపారు.