తాగు నీటి సమస్య ఎక్కువగా ఉంది
సీతారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో 60 కుటుంబాలు ఉన్నప్పటికీ 10 ఇళ్లకు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. మిగిలిన వారికి ఊరిలో ఉన్న చేతి బోరులే దిక్కు. ఒక్కో సారి అవీ పనిచేయడం లేదు. కాలనీకి వచ్చినప్పటి నుంచి తాగు నీరే మాప్రధాన సమస్యగా ఉంది. ట్యాంకును గ్రామానికి దిగువన నిర్మించడం, మోటార్ సరిగా పనిచేయకపోవడ వల్ల మా గ్రామానికి పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు.వేసవిలో మరీ ఇబ్బందిగా ఉంటోంది.
– కుంజం బాసనమ్మ,
సీతారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ