
ప్రయాణికులకు తప్పని పాట్లు
రాజవొమ్మంగి: రాజవొమ్మంగిలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో తమ పిల్లలతో బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ బస్‌షెల్టర్ లేకపోయినా గతంలో ప్రయాణికులు రహదారి పక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో వేచి ఉండేవారు. ఈ గ్రామం మీదుగా ప్రస్తుతం ఎన్‌హెచ్–516ఈ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని తొలగించారు. దీంతో వేచి ఉండేందుకు నిలువ నీడ కరువైందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా రాజవొమ్మంగి సెంటర్‌లో ప్రయాణికుల కోసం బస్‌షెల్టర్ ఏర్పాటుచేయాలని, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని, చలివేంద్రం ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
రాజవొమ్మంగిలో కానరాని బస్‌షెల్టర్లు
మండుటెండలో బస్సుల కోసం
పడిగాపులు