
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మేలు
కొయ్యూరు: ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏఈవో సత్యనారాయణ చెప్పారు. మండలంలోని సింగవరంలోని రైతు సేవా కేంద్రంలో గురువారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ ఎరువులనే వినియోగించాలని సూచించారు.
గూడెంకొత్తవీధి: మానవాళి ఆరోగ్యానికి మేలు చేకూర్చేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని గూడెంకొత్తవీధి ఎంపీపీ బోయినకుమారి అన్నారు. ఏపీసీఎన్‌ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయం ఆచరణ వల్ల ప్రయోజనాలను వ్యవసాయాధికారి మధుసూదనరావు వివరించారు. తహసీల్దార్ రామకృష్ణ, ఉపాధి పథకం ఏపీవో రాంప్రసాద్, జలవనరులశాఖ ఏఈ నాగరాణి, సర్పంచ్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
అడ్డతీగల: ప్రకృతి సాగు అమలుకు సంయుక్త కార్యాచరణ ప్రణాళిక తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఏవో ఎం.సువర్ణకుమారి అన్నారు. వెలుగు భవనంలో గురువారం ప్రకృతి సాగుపై అవగాహన కల్పించారు. సేంద్రియ పంటల సాగుతో ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చని ఎంఈవో పి.శ్రీనివాసరావు అన్నారు. ప్రతి గ్రామంలో పంటలు, విస్తీర్ణం ఆధారంగా సర్వే నిర్వహిస్తామని ప్రకృతి వ్యవసాయ విభాగ అధికారులు తెలిపారు. ఏపీఎం నాయుడు, ఏపీవో అరవాలు, సహాయకులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మేలు

ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మేలు