
అందరి కృషితో బాల్య వివాహాల నిర్మ
● ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి
పాడేరు రూరల్: బాల్యవివాహాల నిర్మూలనకు అందరి సహకారం అవసరమని ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి తెలిపారు. పాడేరు మండలం కందమామిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో శనివారం కిశోర వికాసం కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలు, విద్యా, వైద్యం, వ్యక్తిగత పరిశుభ్రతలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. విద్యతో పాటు ఆరోగ్య, వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధచూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం లక్ష్మి, సీడీపీవో ఝాన్సీరాణి పాల్గొన్నారు.