
పొట్టకూటికి ప్రమాదకర పనిలో...
కోటవురట్ల: ప్రమాద ఘటనలో మృతులంతా రెక్కాడితే కాని డొక్కాడని వారే కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కై లాసపట్నానికి చెందిన సంగరాతి గోవిందుకు ఇద్దరు పిల్లలు కాగా పాప ఇంటర్, బాబు 9వ తరగతి చదువుతున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వాలని ఆలోచనతో గోవిందు స్థానికంగా ఉన్న మందుగుండు తయారీ కేంద్రానికి నాలుగేళ్లుగా పనికెళుతున్నాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్యా పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మృతురాలు పురం పాప మూడేళ్లుగా ఇందులో పనిచేస్తోంది. ప్రమాదమని తెలిసినా కుటుంబానికి వేరే ఆధారం లేక పని కెళ్లి అనంతలోకాలకు పోయింది. మరో మృతుడు గుంపిన వేణుబాబు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఇతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పనికి వెళ్లకపోతే ఆ రోజు పస్తులే. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మృతుడు అప్పికొండ తాతబ్బాయి కాగా ఇతని పేరునే విజయలక్ష్మి ఫైర్ వర్‌ుక్స లైసెన్సు ఉంది. ఇతని తోడల్లుడు మడగల జానకీరాం ఈ ఫైర్ వర్‌ుక్సను నడుపుతుండగా తోడల్లుడికి సాయంగా ఇందులో పనిచేస్తున్నాడు. చౌడువాడకు చెందిన శానాపతి బాబూరావు ఫైర్ వర్క్స్ యజమాని మడగల జానకీరాంకు మావ అవుతారు. అల్లుడికి సాయంగా ఉండడం కోసం ప్రతి రోజు ఉదయాన్నే చౌడువాడ నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రమాదంలో ఇతనితో పాటు ఇతని పెద్దల్లుడు, స్వయాన బావమరిది అయిన అప్పికొండ తాతబ్బాయి కూడా మృతి చెందడంతో ఈ కుటుంబంలో పెద్ద విషాదాన్ని నింపింది. మామా అల్లుళ్లు ఇద్దరూ మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మరో అల్లుడు ఫైర్ వర్క్స్ యజమాని అయిన మడగల జానికీరాం కూడా దాదాపు 40 శాతం కాలిపోవడంతో ప్రమాదస్థితిలో విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో మామా, అల్లుడు
ప్రాణపాయస్థితిలో మరో అల్లుడు

పొట్టకూటికి ప్రమాదకర పనిలో...