అడవిలో అందాలు
ముంచంగిపుట్టు/చింతపల్లి/అరకు టౌన్/డుంబ్రిగుడ: పర్యాటకులను రా..రమ్మని ఆహ్వానించే మన్యం అందాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. తనివితీరా ఆస్వాదించి.. మరపురాని అనుభూతితో వెళ్తున్నారు. వారి అభిరుచులకు తగ్గట్టుగానే పర్యాటక ప్రాంతాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
అరకు పద్మాపురం గార్డెన్: ఇక్కడ గత ప్రభుత్వం అత్యాధునికంగా పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దింది. రూ.48 లక్షలతో కాటేజీలు నిర్మించింది. మరో రూ.16 లక్షలతో గార్డెనింగ్, పగోడాలు, క్యాంటిన్ ఏర్పాటుచేసింది.
అరకు గిరిజన మ్యూజియం: గిరిజనుల సంప్రదాయానికి అద్దం పట్టేలా గిరిజన మ్యూజియం కూడా గత ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది. ఇక్కడ రూ.3.60 కోట్లతో సాహస క్రీడలు, గిరిజనుల జీవనశైలి నమూనాలు, ఆడిటోరియం నిర్మించింది. ఇదే ప్రాంతంలో మరో రూ.1.40 కోట్లతో షాపింగ్ కాంప్లెక్సు నిర్మించి నిరుద్యోగ గిరి యువతకు ఉపాధి వనరులు అందుబాటులోకి తెచ్చింది.
చాపరాయి జలవిహారి: చాపరాయి జలపాతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందుకుగాను పాడేరు ఐటీడీఏ రూ.70 లక్షలు వెచ్చించింది. ఈనిధులతో కాంపౌండ్ వాల్, పాత్‌వే, ప్రవేశద్వారం, మరుగుదొడ్లు నిర్మించింది.
అరకు పినారి: అంజోడ సిల్క్‌ఫారంను అటవీశాఖ అరకు పినారిగా ఆధునికీకరించింది. ఇక్కడ హట్స్ ఏర్పాటుచేసింది. పర్యాటక సీజన్‌లో సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌ల చిత్రీకరణతో సందడిగా ఉంటుంది.
బోడకొండమ్మతల్లి వ్యూపాయింట్: చింతపల్లి మండల పరిధిలోని బోడకొండమ్మ తల్లి వ్యూపాయింట్‌ను గత అరకు ఎంపీ మాధవి తన నిధులతో అభివృద్ధి చేశారు. సుమారు రూ.40 లక్షలతో వ్యూపాయింట్‌ను ఏర్పాటుచేశారు.
చెరువులవేనం: లంబసింగిలో పాలసంద్రాన్ని తలపించే చెరువులవేనంలో పాడేరు ఐటీడీఏ రూ.26.50 లక్షలతో వ్యూపాయింట్‌ను నిర్మించింది.
స్వాతంత్య్ర సమరయోథుల గిరిజన మ్యూజియం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.35 కోట్లతో మ్యూజియం నిర్మాణం జరుగుతోంది. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిపోయేలా గత ప్రభుత్వం సంకల్పించి చేపట్టింది.
ప్రకృతి ఒడిలో భూతల స్వర్గం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే
పర్యాటక రంగం అభివృద్ధి
ప్రత్యేక నిధులతో ఆధునికీకరణ
గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం
కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టని కూటమి ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment