హెల్మెట్‌తో పునర్జన్మ
అనకాపల్లి: తల్లి జన్మనిస్తే, హెల్మెట్ పునర్జన్మనిస్తుందని.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు జంక్షన్ వద్ద జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం జెండా ఊపి ద్విచక్ర వాహనాల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2024 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వల్ల 313 మంది మృత్యువాత పడ్డారని, 734 మంది గాయాలపాలయ్యారని, మీ అజాగ్రత్త వల్ల కుటుంబానికి అన్యాయం చేయవద్దని ఆయన చెప్పారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారే అధికంగా మృత్యువాత పడినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్, సాగర్ సిమెంట్ వారి సీఎస్సార్ నిధుల నుంచి 75 స్టాపర్ బోర్డులను ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణ హోండా షోరూం యాజమాన్యం సీఎస్సార్ నిధు ల నుంచి 30మంది పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఆర్టీవో జి.మనోహర్, డీఎస్పీ ఎం.శ్రావణి, ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ, ట్రాఫిక్ సీఐ టి.వి.విజయకుమార్, ట్రైనీ డీఎస్పీ ఎం.వి.కె.చైతన్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తలతో సురక్షిత ప్రయాణం
కుటుంబానికి అన్యాయం చేయొద్దు
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment