వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై కొరడా
● శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు
సాక్షి, విశాఖపట్నం : అవినీతి ఆరోపణలతో పాటు వేధింపులు, క్రమశిక్షణరాహిత్య ప్రవర్తన, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై ప్రభుత్వం శాఖ పరమైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో విశాఖపట్నం–2 డివిజన్ పరిధిలోని అనకాపల్లి సర్కిల్‌లో విధులు నిర్వర్తించిన డివిజన్ జాయింట్ కమిషనర్ ఎం.సుధాకర్‌రావు, డిప్యూటీ కమిషనర్ పి.జయశంకర్, జీఎస్‌టీవో పి.ప్రసన్నకుమార్, ఏఈవో జమ్ము ధర్మపాల్, ఎయిర్‌పోర్టు సర్కిల్ ఏఈవో టి.సోమేశ్వరరావుపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరి అవినీతి, అధికార దుర్వినియోగంపై సీసీఎస్‌టీ అడిషనల్ కమిషనర్ ఎస్‌ఈ కృష్ణమోహన్‌రెడ్డి, కాకినాడ జాయింట్ కమిషనర్ జి.సుమతిని విచారణాధికారులుగా నియమించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం.. సదరు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment