పార్ట్‌టైం పీఈటీపై వేటు
● విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఫలితం ● చోద్యం జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు
గొలుగొండ: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా రుజువు కావడంతో చోద్యం జెడ్పీ హైస్కూల్లో పార్ట్‌టైం పీఈటీగా పనిచేస్తున్న కుందూరి నూకరాజును విధుల నుంచి పూర్తిగా తొలగించారు. ఈమేరకు డీఈవో జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావునాయుడు శనివారం ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల బాధ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎం శ్రీనివాస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు. పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్‌కు ఇస్తున్నట్లు చెప్పారు.
డీఈవో విచారణ
గత నెల 28న క్రీడా పోటీల కోసం పది మంది విద్యార్థులను పీఈటీ నూకరాజు తమిళనాడు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చే సమయంలో విద్యార్థినుల పట్ల ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడని శుక్రవారం వారి తల్లిదండ్రులతో కలిసి ఎంఈవోకు ఫిర్యాదులు చేసిన విషయం విదితమే. దీనిపై డీఈవో అప్పారావునాయుడు శనివారం విచారణ చేపట్టారు. ఉపాధ్యాయినుల నుంచి వివరాలు సేకరించారు. తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వివరాలు తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంఈవోలు సత్యనారాయణ, ఏవీఎన్‌ఎస్ మూర్తి పాల్గొన్నారు.
పార్ట్‌టైం పీఈటీపై వేటు
Comments
Please login to add a commentAdd a comment