చికెన్ కర్రీ... నో వర్రీ
అనకాపల్లి టౌన్ : చికెన్ తినడం సురక్షితమని, బర్డ్‌ప్లూ వైరస్ పుకార్లు అవాస్తవమని రెడ్ క్రాస్ చైర్మన్, డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. స్ధానిక విజయారెసిడెన్సీలో నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జానకీరామరాజు అధ్యక్షత వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనిషికి అవసరమైన ప్రొటీన్ తక్కువ ధరకు లభించేది చికెన్, ఎగ్‌లో మాత్రమేన్నారు. 100 గ్రాముల చికెన్ తింటే 20 గ్రాముల పోట్రీన్ లభిస్తుందన్నారు. శరీరానికి అవసరమైన క్యాలరీలను అందించకపోతే ఇమ్యూనిటీ లోపిస్తుందన్నారు. బర్డ్‌ప్లూ వ్యాధి కోడి నుంచి కోడి కి మాత్రమే వ్యాప్తిస్తుందన్నారు. చికెన్‌ను 70 సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తే ఎటువంటి వైరస్ అయినా చనిపోతుందన్నారు. ఇంటిలో వంట చేసినప్పుడు 100 సెంటీగ్రేడ్ వేడి వస్తుందన్నారు. దీంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. పశు సంవర్ధక శాఖ శాఖ విశాఖ పట్నం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అరుల్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఎక్కడా బర్డ్‌ప్లూ లక్ష్యణాలు లేవని, దీనిపై నిరంతరం కోళ్ల ఫారాలను తనిఖీలు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎన్‌ఈసీసీ సెంట్రల్ కమిటీ మెంబర్ రామారావు, వైజాగ్ జోనల్ చైర్మన్ శ్రీధర్, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ నార్త్ ఆంధ్ర రీజనల్ ప్రెసిడెంట్ సాయినాథరావు, స్టేట్ లెవిల్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, నెక్ జోనల్ కమిటీ మెంబర్ అప్పారావు, లోకల్ కమిటీ చైర్మన్ గంగిరెడ్డి పాల్గొన్నారు.
చికెన్ , ఎగ్ మేళా..
స్ధానిక ఎన్టీఆర్ గ్రౌండ్‌లో ఈ నెల 25న సాయంత్రం ఐదు గంటలకు చికెన్, ఎగ్ మేళా నిర్వహిస్తున్నట్టు నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రజలందరూ భారీగా తరలిరావాలని కోరారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ విజయ కృష్టన్ పాల్గొంటారన్నారు. ఈ మేళాలో చికెన్, ఎగ్‌తో తయారుచేసిన ఐటమ్స్ ఉచితంగా అందిస్తామన్నారు.
బర్డ్ ఫ్లూ భయం వద్దు...
రేపు ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో చికెన్, ఎగ్ మేళా...
ఎన్‌ఈసీసీ ప్రతినిధుల వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment