స్వచ్ఛ భారత్.. ఇంటింటా స్పెషల్ డ్రైవ్
నక్కపల్లి : జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోను తడి పొడి చెత్తను ఇళ్ల వద్ద నుంచే సేకరించే ప్రత్యేక డ్రైవ్ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు జిల్లా పంచా యతీ అధికారిణి శిరీషారాణి తెలిపారు. గ్రామాల్లో రెండు రోజుల నుంచి పంచాయతీ, సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాల మేరకు తడి, పొడి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పంచాయతీ స్వీపర్లు, గ్రీన్ అంబాసిడర్ల సాయంతో ప్రతి ఇంటికి వెళ్లి గతంలో పంచాయతీ వారు అందజేసిన ప్లాస్టిక్ డబ్బాల్లో తడి, పొడి చెత్తను సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలిస్తున్నా రు. ఇళ్లల్లో ఊడ్చిన చెత్తతోపాటు, వీధుల్లో, ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న చెత్తను సేకరించే ప్రక్రియ జరుగుతోంది.ఆదివారం ఆమె నక్కపల్లిలో తడి , పొడి చెత్తను సేకరించే ప్రత్యేక డ్రైవ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ వారికి అందజేసేలా అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. వీధులు అపరిశుభ్రంగా ఉంటున్నాయన్నారు. స్వచ్ఛతా, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈ చెత్త సేకరణ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో పంచాయతీ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛభారత్ లక్ష్యంగా చేసుకుని నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించానే ఉద్దేశంతో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను సంపద తయారీ కేంద్రాల వద్ద వేర్వేరుగా ఉంచి వానపాముల సాయంతో వర్మి కంపోస్టు తయారు చేయడం జరుగుతుందన్నారు. ఇళ్ల వద్దే ఇంకుడు గుంతలు నిర్మించడం, తడి, పొడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువులు తయారీ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచిస్తోందన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ వారి సాయంతో త్వరలోనే ఈ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పంచా యతీల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్సులు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారన్నారు. ఒకటి రెండు రోజులతో ఈ కార్యక్రమం ముగించకుండా ప్రజలు సైతం నిరంతర ప్రక్రియగా భావించి ఇళ్లలో ఊడ్చిన చెత్తను బయట వేయకుండా ప్రత్యేక డబ్బాల్లో ఉంచి పంచా యతీ స్విపర్లు, గ్రీన్ అంబాసిడర్లకు అందజేయాలన్నారు. నక్కపల్లి, దేవవరం, వేంపాడు, ఉద్దండపురం, చినదొడ్డిగల్లు, గొడిచర్ల, నెల్లిపూడి, వెదుళ్లపాలెం, పెదతీనార్ల, చినతీనార్ల, గునిపూడి, ఉపమాక తదితర గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని రెండురోజుల నుంచి నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీసం రాజు, పంచాయతీ కార్యదర్శులు సన్ని శ్రీనివాస్, బిఏబీఎల్‌మూర్తి, రాజశేఖర్, శ్రీనివాస్, మహేష్ పాల్గొన్నారు.
తడి, పొడి చెత్త సేకరణపై
ప్రజల్లో విస్తృత అవగాహనకు చర్యలు
డీపీవో శిరీషారాణి
స్వచ్ఛ భారత్.. ఇంటింటా స్పెషల్ డ్రైవ్
Comments
Please login to add a commentAdd a comment