శివరాత్రికి ప్రత్యేక బస్సులు
నర్సీపట్నం : మహా శివరాత్రి నేపథ్యంలో నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు గొలుగొండ ధారమట్టం, రావికతం కల్యాణలోవ శివ క్షేత్రాల దర్శనంకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నెల 25 నుంచి 27వ తేదీ వరకు నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుండి అధిక సంఖ్యలో బస్సులు నడిపేలా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు బస్సులను నడుపుతున్నారు. రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 50 బస్సులు నడిపేలా ప్రజా రవాణా అధికారులు చర్యలు చేపట్టారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా భక్తులకు సురక్షితమైన ప్రయాణం అందించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచకుండా సాధారణ చార్జీలతో భక్తులు ప్రయాణించేలా సౌకర్యం కల్పించారు.
25 నుంచి 27 తేదీ వరకు
సాధారణ చార్జీలే...
మహాశివరాత్రి స్నానాలకు వెళ్లే భక్తులకు బస్సులు సిద్ధంగా ఉంచాం. 50 బస్సులను నడుపుతున్నాం. రద్దీని బట్టి బస్సులను పెంచుతాం. ఆర్టీసీ సిబ్బంది నిత్య పర్యవేక్షణలో బస్సులను తిప్పుతాం. సాధారణ చార్జీలతోనే బస్సులు నడుపుతాం.
ధీరజ్(డిపో మేనేజర్, నర్సీపట్నం)
Comments
Please login to add a commentAdd a comment