దీనికి ‘కోడ్’ వర్తించదా..?
తుమ్మపాల : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల్లో భాగంగా రాజకీయ నాయకుల ఫొటోలతో ప్రదర్శించిన అన్ని రకాల ఫ్లెక్సీలను తొలగించాల్సిన అఽధికారులు కూటమి నాయకుల ఫ్లెక్సీలకు ప్రత్యేక సడలింపులు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుల ఫ్లెక్సీల మినహా ఇతర పార్టీల బ్యానర్లను తొలగించారు. కూటమి నాయకుల బ్యానర్లపై గుడ్డలు కప్పి ప్రత్యేక మినహాయింపులు చేయగా కొన్ని గ్రామాల్లో బహిరంగంగానే వదిలేశారు. శంకరం వద్ద బొజ్జన్నకొండ, కోడూరు పంచాయతీ గొల్లపేట, పలు గ్రామాల్లో కూటమి నాయకుల బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment