సాల్వియాన్ కార్మికుల సమస్యలపై వినతి
అచ్యుతాపురం రూరల్ : సాల్వియాన్ పరిశ్రమ కార్మికుల వేతనాల సమస్యలపై లేబర్ కమిషనర్‌కి సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రొంగలి రాము మాట్లాడుతూ సాల్వియాన్ పరిశ్రమ కార్మికులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధంతరంగా మూసివేయడం అన్యాయమన్నారు. మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించి, పరిశ్రమ తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం, లేబర్ అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు ఇవ్వవలసిన బకాయి వేతనాలు ఇస్తూ పరిశ్రమ తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధంతరంగా పరిశ్రమ బంద్ చేసిన సాల్వియాన్ పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయు నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment