ఎస్‌ఐ కొలువులు సాధించిన పూర్వ విద్యార్థులకు సత్కారం
డీఎస్సీ శ్రీనివాసరావు సమక్షంలో ఎస్‌ఐ
కొలువులు సాధించిన నాని, దుర్గాప్రసాద్‌లను
సత్కరిస్తున్న కరస్పాండెంట్ కోనా సతీష్
నర్సీపట్నం : సబ్ ఇన్‌స్పెక్టర్లుగా కొలువులు సాధించిన పూర్వ విద్యార్థులను రిషీ కళాశాల యాజమాన్యం, డీఎస్పీ పి.శ్రీనివాసరావు సమక్షంలో ఘనంగా సత్కరించారు. రావికమతం మండలం, పి.పొన్నవోలు గ్రామానికి చెందిన పి.నాని, కె.దుర్గాప్రసాద్ రిషీ డిగ్రీ కళాశాలలో చదివారు. ఇటీవల నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ల పోటీ పరీక్షల్లో ఎస్‌ఐ కొలువులు సాధించి, ప్రస్తుతం ట్రైనీ ఎస్‌ఐలుగా బాధ్యతలు స్వీకరించారు. వీరిని కళాశాలకు ఆహ్వానించి డీఎస్పీ సమక్షంలో కరస్పాండెంట్ కోనా సతీష్, అధ్యాపకులు సత్కరించారు. అనంతరం ట్రైనీ ఎస్‌ఐలు పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment