వాహనమిత్ర ఎగ్గొట్టి భారీ జరిమానాలా?
● వడ్డాదిలో ఆటో కార్మికుల ఆందోళన
బుచ్చెయ్యపేట : కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి వాహనమిత్ర నగదు అందించకుండా భారీ జరిమానాలు విధించడం వాహనదారులను మోసగించడమేనని ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.లక్షణ ఆగ్రహం చెందారు. మంగళవారం మేజర్ పంచాయతీ వడ్డాదిలో ఆటో యూనియన్ నాయకులతో కలిసి ప్రభుత్వం కొత్తగా తీసికొచ్చిన నూతన మోటార్‌యాక్ట్ చట్టం106(1)(2)ను వెంటనే రద్దు చేయాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆటో వాహన డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కూటమి ప్రభుత్వం సంపద సృష్టి అని చెప్పి వాహనదారులపై అదనపు భారం వేయడం తగదని అన్నారు. కొత్త మోటార్ యాక్ట్‌ను రద్దు చేసి ప్రతి వాహనమిత్రకు రూ.15 వేలు అందించాలన్నారు. కార్యక్రమంలో శేఖర్, నూకరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment