పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
ఉపాధ్యాయులను సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు
చీడికాడ : మండలంలో అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1990–91 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు మంగళవారం తమ చదువుకున్న పాఠశాలలో కలుసుకున్నారు. 35 సంవత్సరాలు తర్వాత తొలిసారిగా కలుసుకుని, పాత జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఈ సందర్బంగా నాడు పాఠశాలల్లో చదివిన రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఆర్థిక సహకారంతో పాఠశాలకు కంప్యూటర్‌ను అందజేశారు. పాఠశాల ఆవరణలో 30 మెక్కలు నాటారు. పాఠశాలల్లో చదువుతున్న 250 మంది విద్యార్దినీ, విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. అప్పట్లో చదువు నేర్పిన ఉపాధ్యాయులు వెంకట్రావు, పాల్ మాస్టర్, నర్సిరెడ్డి, రికార్డు అసిస్టెంటు గిరిజ, అప్పటి అటెండర్ లక్ష్మి తదితరులను సత్కరించారు. ప్రస్తుత పాఠశాల హెచ్‌ఎం, ఇతర ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని, ఎంపీపీ కురచా జయమ్మ, పెంటకోట రమణబాబు, పుట్టా రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment