ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ
తుమ్మపాల : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్‌ఏఎంపీ పథకం ద్వారా ఉచిత శిక్షణ నిర్వహిస్తామని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు జి. నాగరాజారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందుటకు ఆర్‌ఏఎంపీ పథకం ద్వారా వ్యవస్థాపకత, నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ,చిన్న మధ్యతరహా పరిశ్రమలు) ఎపి.ఎంఎస్‌ఎంఇ. అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు పొందిన శిక్షణ సంస్థ ట్రెండ్జ్ ఐటీ వారితో శిక్షణ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా నెల రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుకోవాలన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ పొంది, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించుటకు అవసరమైన అవగాహన, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, పథకాల వివరాలు, మార్కెట్ పై అవగాహన కలిగి, తద్వారా ఉపాధి పొందవచ్చునని తెలిపారు.
ఈ శిక్షణ తరగతులు అనకాపల్లి పట్టణంలో ట్రెండ్జ్ ఐటీ, 12–46 మాక్స్ షాపింగ్ మాల్ పైన, 3 వ ఫ్లోర్, ఉషాప్రైమ్ పక్కన, కాంప్లెక్స్ దగ్గర, 2. చోడవరం ట్రెండ్జ్ ఐటి, 5–20, లక్ష్మిపురం రోడ్, వేంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా గల కేంద్రాలలో ఈ నెల 8 నుంచి నిర్వహించబడునని తెలిపారు. అనకాపలి 9502166626, 9948519782, చోడవరం 7386084548, 7799883952 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఉచిత శిక్షణకు హాజరు కాదలచిన అభ్యర్థులు 18 నుండి 58 సంవత్సరాలు వయస్సు కలిగి, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, కులధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్ కార్డుతో ఈ నెల 5 నుండి సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment