హామీలేతప్ప జీవోలు లేవు
మాకు ఇచ్చే జీతం కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాం. యాప్‌ల పేరిట ఉదయం నుంచి రాత్రి వరకూ పని ఒత్తిడి పెంచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. మా ఒప్పంద మినిట్స్ బుక్‌లో హామీలను అమలు చేస్తూ జీవోలు లేవు. మా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు. పెరుగుతున్న నిత్యావసర ధరల కారణంగా వచ్చే జీతంతో కుటుంబాలు గడవడం లేదు. ఈ బడ్జెట్‌లో మా హామీలు నెరవేరుస్తారనుకుంటే తెలివిగా అక్కరకు రాని ప్రకటనలు చేశారు. ఏదో అరకొరగా పనికి రాని హామీలు మూడు ఇచ్చారు. ఇది మమ్మల్ని వెక్కిరించినట్టుగా ఉంది. అందుకే విజయవాడకు పయనమయ్యాం. ఇప్పటికై నా ప్రభుత్వం కనీస వేతనాలు పెంచాలి. లేదంటే మరింత ఉద్యమిస్తాం.
– కాకర శాంతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment