విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి
గోపాలపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ మహిళా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నోవాటెల్ హోటల్‌కి చేరుకున్నారు. గురువారం గీతంలో జరిగే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం బడ్జెట్ అంశంపై నోవాటెల్ హోటల్‌లో నిర్వహించే సదస్సులో అధికారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులతో భేటీ అవుతారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడతారు.
Comments
Please login to add a commentAdd a comment