పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు
గొలుగొండ/నాతవరం: నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను త్వరలో ప్రారంభిస్తామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఆయన బుధవారం గొలుగొండ, కృష్ణదేవిపేట, నాతవరం పోలీస్ స్టేషన్లను సందర్శించారు. కొత్త భవనాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గంజాయి రవాణా జరగకుండా నిత్యం గస్తీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మెలగాలని తెలిపారు. రహదారి భద్రత, సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌కు కొత్త వాహనం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నాతవరం స్టేషన్‌లో ఉన్న వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించి వీటి కేసులను ట్యాగ్ చేయాలని ఎస్‌ఐను ఆదేశించారు. స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి పలు సూచనలు చేశారు. జిల్లాలో నక్కపల్లితోపాటు పలు మండలాల్లో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామన్నారు. జిల్లాలో కొత్తకోట పోలీసు స్టేషన్ పరిఽధిలో తరుచు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతున్నారని, పీడీ యాక్టు ప్రకారం వారి ఆస్తులు జప్తు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్లి అమలు చేస్తామన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు, కృష్ణదేవిపేట, గొలుగొండ, నాతవరం ఎస్‌ఐలు తారకేశ్వర్రావు, రామారావు, సీహెచ్ భీమరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
త్వరలో ప్రారంభం ఎస్పీ తుహిన్ సిన్హా
Comments
Please login to add a commentAdd a comment