టెన్త్ పరీక్షల్లో విద్యార్థుల హక్కులకు ప్రాధాన్యమివ్వా
అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థుల హక్కులతో ముడిపడి ఉన్న సంక్షేమానికి జిల్లా అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అన్నారు. స్థానిక జీవీఎంసీ వేల్పులవీధి బాలికోన్నత పాఠశాల ఆవరణలో బుధవారం విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్, కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా తాగునీటి సదుపాయం, చక్కని గాలి, వెలుతురు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఫ్యాన్లు, సరిపడినన్ని బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల పరిధిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, మారుమూల గ్రామాల విద్యార్థులకు పరీక్షలకు హాజరవడానికి రవాణా ఇబ్బందులు లేకుండా సరిపడా బస్‌లు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రంలో వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పి.అప్పారావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలల నుంచి 20,774 మంది విద్యార్థినీ విద్యార్థులు 107 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణకమిషన్ సభ్యుడు గొండు సీతారాం
Comments
Please login to add a commentAdd a comment