మహిళా సాధికారతకు తోడ్పాటు
ఎస్పీ తుహిన్ సిన్హా
సాక్షి, అనకాపల్లి :
విద్య, ఉద్యోగ సాధనలో మహిళల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సాధికార వారోత్సవాల్లో భాగంగా వివిధ కాలేజీల విద్యార్థినులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిమశేఖర్ డిగ్రీ కాలేజ్ , ఆదినారాయణ మహిళా డిగ్రీ కాలేజ్, ఏఎంఏఎల్ కళాశాల, డైట్ కళాశాలల నుంచి విద్యార్థినులు పాల్గొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, ఇతర భద్రతా పరికరాలను గూర్చి అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఆటలు, చిత్రలేఖన పోటీలు, వ్యాసరచన పోటీలు, డిబెట్‌లు, సంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుంచి మహిళా సాధికార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలందరూ తమ తమ హక్కుల గురించి, చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో పురుషులతో పోటీగా మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి అవగాహన కల్పించి, మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. ఒత్తిడిని, సమస్యలు ఎదురైన సమయంలో .. వాటిని ఎదుర్కొని మహిళలు ధైర్యంగా నిలవాలని తెలియజేశారు. మహిళలు ఉన్నత చదువులు అభ్యసించి తనకు తాను ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరారు.
అత్యవసర సమయాల్లో ..
హెల్ప్‌లైన్‌లకు సమాచారం ఇవ్వండి
మహిళలు, చిన్నారులు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నా వెంటనే సహాయం అందించేలా హెల్ప్‌లైన్ నంబర్లు వారికి తెలియజేసి, అత్యవసర సమయాల్లో కాల్ చేసి పోలీసులు సహాయం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, ఎస్‌బీఎస్పీ బి.అప్పారావు, మహిళా డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, ఏఆర్ పి.నాగేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్, బాల సూర్యారావు, రామకృష్ణారావు, మన్మథరావు, వెంకటచిట్టి ఎస్‌ఐలు వెంకన్న, సురేష్ బాబు, ఆదినారాయణ ఇతర అధికారులు సిబ్బంది, వివిధ కాలేజీ విద్యార్థులకు పాల్గొన్నారు.
విద్య, ఉద్యోగ సాధనలో ముందడుగు వేయాలి
కళాశాల విద్యార్థినులతో ఓపెన్ హౌస్
ఘనంగా మహిళా సాధికార వారోత్సవాలు
మహిళల భద్రత కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
చైల్డ్ హెల్ప్ లైన్ 1098
ఉమెన్ హెల్ప్ లైన్ 181
పోలీస్ హెల్ప్ లైన్ 100 / 112
సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930
ఈగల్ హెల్ప్ లైన్ 1972 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
అనకాపల్లి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 94409 04229
మహిళా సాధికారతకు తోడ్పాటు
మహిళా సాధికారతకు తోడ్పాటు
Comments
Please login to add a commentAdd a comment