ఏపీఐఐసీ చైర్మన్‌కు నిర్వాసితుల వినతి
నక్కపల్లి : మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఏపీఐఐసీ వారు సేకరించిన భూములను ఏపీఐఐసీ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు గురువారం పరిశీలించారు. రాజయ్యపేట, డీఎల్‌పురం, అమలాపురం తదితర గ్రామాల్లో పర్యటించి ఎన్ని ఎకరాలు సేకరించారు.. వాటిలో జిరాయితీ ఎంత? ప్రభుత్వ, ఢీఫారం భూములు ఎంత? అనే వివరాలు తెలుసుకున్నారు. బల్క్ డ్రగ్‌పార్క్, ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా స్టీల్‌ప్లాంట్ వారికి ఎంత భూములు కేటాయించారు.. అనే వివరాలపై ఆరా తీశారు. అనంతరం రాజయ్యపేట సమీపంలో జరుగుతున్న బల్క్ డ్రగ్ పార్క్ పనులు పరిశీలించారు. ఏపీఐఐసీ వారు నిర్మిస్తున్న అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ఆధ్వర్యంలో పలువురు నిర్వాసితులు చైర్మన్‌ను కలిసారు. భూసేకరణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించాలన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్నారు. డీఫారం భూముల్లో మామిడి,జీ డితోటలకు నష్టపరిహారం చెల్లించలేదని, జిరాయతీ రైతులతో సమానంగా వీరికి కూడా పరిహారం చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment