ఉపాధి కూలీల ఆందోళన
బుచ్చెయ్యపేట: ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించి తమకు ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ ఎల్.సింగవరం గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. గ్రామంలోని కొండల వద్ద ఉన్న ప్రభుత్వ బంజరు భూమిలో గురువారం జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టడానికి వెళ్లిన కూలీలను అదే గ్రామానికి చెందిన కొంత మంది అడ్డుకున్నారు. ఈ భూమిని నమ్ముకుని తుప్పలు తొలగించి మొక్కలు పెంచుకుని ఉపాధి పొందుతున్నామని, ఇక్కడ ఉపాధి పనులు చేపట్టొద్దని కూలీలను అడ్డగించారు. దీంతో గ్రామ నాయకులు కలగజేసుకుని ఉపాధి పనులను అడ్డుకోవద్దని సాగు రైతులకు సూచించారు. ఈ క్రమంలో ఉపాధి కూలీలు, సాగు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఉపాధి పనులు కల్పించాలని కూలీలు రేణం శ్రీను, రామోజీరావు, రాము, గజ్జాలమ్మ, పి.నాగేశ్వరరావు, వి.పుష్పా, కె.బుల్లమ్మ, తదితర్లు బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ లక్ష్మి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment