గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
పరవాడ: గంజాయి అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులను ఆదేశించారు. పరవాడ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన అకస్మికం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి వినియోగదారుల వివరాలను సేకరించి, వారిపై నిఘా ఉంచాలన్నారు. రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులను కౌన్సిలింగ్ చేయడంతో పాటు వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు గస్తీ చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళా చట్టాలు, పోక్సో యాక్ట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైం, రోడ్డు భద్రతలపై స్థానిక పోలీసులు, మహిళా పోలీసులతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిశీలించి, వాటి పురోగతిని ఆరా తీశారు. స్టేషన్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్‌ఐలు కృష్ణారావు, మహలక్ష్మిలు ఉన్నారు.
పరవాడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలో ఎస్పీ తుహిన్ సిన్హా
Comments
Please login to add a commentAdd a comment