గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆదుకున్నది వైఎస్సార్‌సీపీనే
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ
అనకాపల్లి టౌన్: వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో 89.90 లక్షల నిధులు తీసుకొచ్చి గోవాడ సుగర్ ఫ్యాక్టరీని అన్ని విధాలా ఆదుకుందని అనకాపల్లి జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ తెలిపారు. స్ధానిక రింగ్‌రోడ్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం సుగర్ ఫ్యాక్టరీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్రషింగ్‌కి అనుకూల పరిస్థితులు కల్పించడంలో ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు. ప్రతి ఏడాడి నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రారంభం కావల్సిన క్రషింగ్ నేటికీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదన్నారు. ఇప్పటికి లక్షా 50 వేల టన్నులు క్రషింగ్ జరగాల్సి ఉండగా కేవలం 60 టన్నుల క్రషింగ్ మాత్రమే జరిగిందన్నారు. ఈ క్రమంలో రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి ఈ నెల 10న రాష్ట్ర శాసన మండలి సభ్యులు బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా ముఖ్య నాయకులు ఫ్యాక్టరీని సందర్శించి రైతులు, యాజమాన్యంతో చర్చిస్తారన్నారు. సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, పట్ణణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, కశింకోట ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ మలసాల రమణారావు, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment