మహిళలు అన్నింటా సమానులు..
● మామూళ్లు.. గమ్మత్తుగా!
8లో
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
● ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి..
● ఉత్పాదక యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం
● ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
● ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఇప్పటికే ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి నేత ఒకరు... ఇప్పుడు కలెక్షన్ల కోసం ఏకంగా బెంగళూరు నుంచి ఓ వ్యక్తిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా నియోజకవర్గంలోని మొత్తం మద్యం షాపుల నుంచి మామూళ్లు వసూలు చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా మద్యం షాపు సిండికేట్లతో గత నెలలో సమావేశం ఏర్పాటు చేసి మరీ టార్గెట్లు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి మద్యం షాపు యజమాని ప్రతి నెలా రూ.2.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా సదరు ప్రైవేటు మద్యం దుకాణదారుడు బెల్టు షాపులకు ఎమ్మార్పీ మీద రూ.10 అధికంగా విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయా దుకాణాల పరిధిలో బెల్టు షాపులకు మద్యం సరఫరా బాధ్యత కేవలం వారికే దక్కేలా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయా మద్యం షాపులతో పాటు బెల్టు షాపుల జోలికి ఎకై ్స జ్‌శాఖ అధికారులు వెళ్లకుండా కూడా ఆదేశాలు జారీ కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలా వసూళ్ల మొత్తం రూ.3 లక్షలకు పెంచనున్నట్టు కూడా ముందుగానే ప్రకటించినట్టు సమాచారం. మొత్తంగా ఒక ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శల నేపథ్యంలో దూరంగా పెట్టిన సదరు నేత.. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన మరో వ్యక్తి ద్వారా వసూళ్లకు దిగడం చర్చనీయాంశమవుతోంది.
విచ్చలవిడిగా బెల్టు షాపులు!
ఇప్పటికే పేకాట, కోడి పందేల వ్యవహారంలో వార్తలకెక్కిన సదరు నేత.. ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా పేకాట డెన్‌ల నిర్వహణలో కొంత మొత్తం వసూలు చేసేందుకు మరీ అనుమతి ఇచ్చారు. వాటి జోలికి వెళ్లకుండా కూడా కొద్దిరోజుల పాటు నియంత్రించగలిగారు. అయితే అంతర్గత విభేదాల కారణంగా ఈ వ్యవహారం కాస్తా బయటకు వచ్చింది. దీంతో తాత్కాలికంగా పేకాట శిబిరాలు మూతపడ్డాయి. ఇక కోడి పందేల శిబిరాలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఏకంగా మూడు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. అధికారికంగా సదరు నేత పాల్గొనకపోయినా వారి అండతోనే ఈ వ్యవహారం నడిచింది. దీంతో అటువైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. పైగా కోడి పందేల శిబిరాల ప్రాంతంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కూడా జరిగాయి. బహిరంగంగానే మద్యాన్ని విక్రయించారు. వీటి ఏర్పాట్లకు కూడా వేలం పాట నిర్వహించి మరీ వసూళ్లకు తెగబడ్డారు. మరోవైపు ఇప్పటికే సదరు నేత నియోజకవర్గంలో భారీగా బెల్టు షాపులు వెలిశాయి. బెల్టు షాపుల కోసం వేలం పాట నిర్వహించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయినా సదరు నేత అండదండలతో చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. కేవలం ఈ నియోజకవర్గంలోనే ఏకంగా వందకుపైగా బెల్టు షాపులు ఏర్పాటైనట్టు సమాచారం. మద్యం దుకాణదారులు ఆయా బెల్టు షాపులకు ఎమ్మార్పీకి రూ.10కి అధికంగా మద్యం విక్రయించుకుంటున్నారు. ఇందులో వచ్చే సగం ఆదాయాన్ని సదరు నేతకు ముట్టచెబుతున్నట్టు తెలుస్తోంది.
సాక్షి, అనకాపల్లి : మహిళలు ఉత్పాదక యూనిట్లు స్థాపించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర అబ్కారీ, భూగర్భ గనుల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక పెంటకోట కన్వెన్షను హాలులో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్, జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్, జేసీ ఎం. జాహ్నవి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలు వారి హక్కుల కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి1911 మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా సాధించుకున్నారని తెలిపారు. 2025 సంవత్సరానికి ‘మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన పదవులు’ థీమ్‌గా మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్టు తెలిపారు. ప్రోత్సాహక యూనిట్లు స్థాపనకు జిల్లాలో కోడూరు వద్ద 30 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని, ఎవరైనా యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తే వారికి రటన్ టాటా ఇన్నొవేషన్ వారిచే శిక్షణ అందించి, వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం దీపం పథకం అమలు, పెన్షన్లు మొత్తం పెంపు, అన్నా కేంటీన్లు తిరిగి ప్రారంభం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మే నెల నుంచి తల్లికి వందనం, రైతులకు, మత్స్యకారులకు భరోసా పథకాలు అందించడం జరుగుతుందన్నారు.
అన్ని రంగాల్లో నాయకత్వం : స్పీకర్ అయ్యన్న
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడు తూ మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వం వహిస్తున్నారని, ప్రస్తు తం జిల్లాను విజయపథంలో నడిపించేది మహిళా అధికారులేనని కొనియాడారు. మహిళల ఆర్థికాభివృద్ధ్దికి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సంఘాలు బలోపేతమై ప్రభుత్వానికే అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
నమ్మకంతో ముందడుగు : కలెక్టర్ విజయకృష్ణన్
జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు, సమాన వేతనం కొరకు ఎన్నో పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నామని, అందుకు గుర్తుగా అదే స్ఫూర్తిని కొనసాగించుటకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నట్లు తెలిపారు. సీ్త్ర పుట్టుకతోనే బలమైనదని, సీ్త్ర అద్భుతాలు సృష్టించగలదని, ప్రతి సీ్త్ర తనపైన నమ్మకంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు.
మహిళల రక్షణకు శక్తి మహిళ యాప్ : ఎస్పీ సిన్హా
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ పోలీసుశాఖలో మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణకు పోలీసుశాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 112 నంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునన్నారు. ప్రభుత్వం ప్రారంభిస్తున్న శక్తి మహిళా యాప్ ప్రతి మహిళ వారి మైబెల్‌లో నిక్షిప్తం చేసుకొని సహాయం కొరకు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, రమేష్ బాబు , జేసీ జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్‌డీవో షేక్ ఆయిషా, జిల్లా గ్రామీణాభివృది సంస్థ పీడీ శచీదేవి, మహిళా, శిశు సంక్షేమశాఖ పీడీ అనంతలక్ష్మి, సివిల్ సప్లయి డీఎం జయంతి, మహిళా సంఘా ల సభ్యులు పాల్గొన్నారు.
తుమ్మపాల : జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ నెల 10 సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంను యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రజలకు మరింత సమర్థవంతంగా అమలు చేసే నిమిత్తం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంతో పాటు, డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామసచివాలయాలలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయం, మండల తహసీల్దార్, ఇతర కార్యాలయాల్లో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
యథావిధిగా రేపు ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం
బెంగళూరుకు చెందిన వ్యక్తి ద్వారా..!
వాస్తవానికి సదరు నేతకు ఏళ్లుగా నమ్మినబంటుగా ఉన్న వ్యక్తి ద్వారా అన్ని వ్యవహారాలు నడిపేవారు. అయితే సదరు వ్యక్తిపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ స్థానంలో తనకు నమ్మిన బంటుగా ఉన్న మరో వ్యక్తిని బెంగళూరు నుంచి ప్రత్యేకంగా పిలిపించినట్టు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మద్యం సిండికేట్ల ద్వారా వసూలు చేసే మొత్తం కూడా సదరు బెంగళూరు వ్యక్తి చేతికి చేరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం సెజ్‌లోని ఒక కంపెనీలో సీసీ కెమెరాలను బిగించే పని ఇప్పించడం కోసం కూడా రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ తతంగమంతా కూడా బెంగళూరు వ్యక్తి ద్వారానే నడిచినట్టు సమాచారం. మొత్తంగా పీఏలు మారుతున్నారు తప్ప వసూళ్ల కార్యక్రమం మాత్రం తమకు తప్పడం లేదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బెంగళూరు వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ నేతలే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
మహిళలు అన్నింటా సమానులు..
మహిళలు అన్నింటా సమానులు..
మహిళలు అన్నింటా సమానులు..
Comments
Please login to add a commentAdd a comment