మహిళా నాయకత్వానికి ఎంతో ప్రోత్సాహం
అనకాపల్లి టౌన్: మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని రింగ్‌రోడ్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ ఒక్క వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీనేనని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అనంతరం అతిఽథులను శాలువాతో సత్కరించి చిరు జ్ఞాపికలను అందజేశారు. మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదీప్‌రాజ్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, కశింకోట ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ మలసాల రమణారావు, పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ఎల్ సుజాత, పెందుర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నదియా, పట్టణ మహిళా కార్పొరేటర్లు జాజుల ప్రసన్న లక్ష్మి, పీలా సౌజన్య, జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు ఈర్లె అనురాధ, అమృతవల్లి, కొత్తూరు సర్పంచ్ ఎస్ లక్ష్మి, నియోజకవర్గ పార్టీ నాయకులు నీటిపల్లి లక్ష్మి, పండాడి పద్మ, మరిపల్లి శోభ, కొటియాడి పద్మ, దొడ్డి లక్ష్మి, వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదే
పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు
పార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం
మహిళా నాయకత్వానికి ఎంతో ప్రోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment