ఇంకా చి‘క్కె’న్!
అనకాపల్లిటౌన్: బర్ట్‌ప్లూ సోకి కోళ్లు చనిపోతున్నాయని అపోహతో ఇంకా కొంత మంది చికెన్ తినడానికి జంకుతున్నారు. చికెన్ 80 డిగ్రీలు వేడి తో వండుకొని తింటే ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు అవగాహన కల్పిస్తున్నా ప్రజలు భయపడుతున్నారు. మటన్, చేపలు ధరలు అధికంగా ఉన్నా వాటి వైపే అధిక శాతం ప్రజలు మెగ్గుచూపుతున్నారు. చికెన్ ధరలు వాస్తవంగా శనివారం కంటే ఆదివారం ఎక్కువగా ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా భారీగా ధర తగ్గినా చికెన్ విక్రయాలు అంతతమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో శనివారం కేజి విత్ స్కిన్ 180 ఉండగా ఆదివారం 160, స్కిన్ లెస్ 190 నుంచి 170 రూపాయలకు తగ్గింది. మార్కెట్‌లో సేల్స్ పెంచుకోవడానికి కొందరు ఇంకో పదిరూపాయిలు తగ్గించి 160 రూపాయలకు అమ్మకాలు చేపట్టారు. అయినా అమ్మకాలు అంతంతమాత్రంగానే జరిగాయి. అవగాహన సదస్సులు, చికెన్ మేళాలు నిర్వహిస్తున్నా చికెన్ కొనడానికి వెనకడుగు వేస్తుండడం గమనార్హం.
ఇంకా చి‘క్కె’న్!
Comments
Please login to add a commentAdd a comment