గిరిజన గ్రామాల్లో దాహం దాహం
మాడుగుల: మండలంలో శంకరం పంచాయతీ గొప్పూరు, తాడివలస గిరిజన గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం నాన్‌షెడ్యూల్ ఏరియా, ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో తమ దాహం తీర్చాలంటూ సోమవారం మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాన్‌షెడ్యూల్ ఏరియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరటా నరసింహమూర్తి మాట్లాడుతూ.. ఇది వరకు ఈ గ్రామాలకు పైపులైన్ ఏర్పాటు చేసి తాగునీరు అందించారన్నారు. అయితే ప్రస్తుతం సక్రమంగా కొళాయిలు నుంచి తాగునీరు అందకపోవడంతో గిరి మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు వచ్చి మరమ్మతులు చేపడుతున్నా సరే రెండు రోజులు నీరు వచ్చి మళ్లీ పాడవుతున్నాయని వాపోయారు. మళ్లీ షరా మామూలే అయిపోతుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రెండు గ్రామాలకు తాగునీటి సమస్యలు పరిష్కరించాలని గిరిజన మహిళల తరుపున ఆదివాసీ గిరిజన సంఘం కోరింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మహిళా కార్యకర్తలు గిన్నెపల్లి సన్యాసమ్మ, సోలం మంగ, సోలం వరలక్ష్మి, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో మోకాళ్లపై నిరసన
Comments
Please login to add a commentAdd a comment