● 10 మేకలు సజీవ దహనం ● రూ.4 లక్షల ఆస్తి నష్టం
బుచ్చెయ్యపేట: పెదపూడి శివారు రాజుపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పాకలు దగ్ధమవగా 10 మేకలు సజీవ దహనమయ్యాయి. గ్రామానికి చెందిన తండ్రికొడుకులు నమ్మి పైడయ్య, చిలుకులు మేకలు మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి దూరంగా మూడు పాకలు వేసుకుని మేకలపై ఆధారపడి జీవిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పాల్చిపారేసిన సిగరెట్టు కారణంగా ఈ అగ్నిప్రమాదం జరగ్గా మూడు పాకలతో పాటు పాకల్లో ఈనిన మేకలు, పిల్లలు పది సజీవ దహనమయ్యాయి. సాయంత్రం పాకకు వచ్చిన పైడయ్య, చిలుకులు కాలిపోయిన పాకలు, మేకలను చూసి భోరున విలపించారు. సుమారు రూ.4 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
పెదపూడిలో మూడు పాకలు దగ్ధం