యలమంచిలి రూరల్: సీఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం 2025 సందర్భంగా తీర ప్రాంత ‘సైక్లోథాన్–2025’ మంగళవారం యలమంచిలి చేరుకుంది. తీరప్రాంత భద్రత గురించి అవగాహన పెంపొందించడం, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణా వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం పట్టణానికి చేరుకున్న సైక్లోథాన్‌కు విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనస్వాగతం పలికారు.
ఈనెల 31వ తేదీన కన్యాకుమారి చేరుకోవడంతో సైక్లోథాన్ 2025 ముగుస్తుంది. కార్యక్రమంలో కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్‌పాయ్, డిప్యూటీ కమాండెంట్ వికాష్ కుమార్ సాహు, సహాయ కమాండెంట్ అమిత్ కుమార్, ఇన్‌స్పెక్టర్ కె.కుమార్, మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు, తహసీల్దార్ కె.వరహాలు, పట్టణ ప్రణాళికాధికారి వై.శ్రీలక్ష్మి, పట్టణ ఎస్సై కె.సావిత్రి, పీడీ వై.పోలిరెడ్డి, వీరభద్రరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
సైక్లోథాన్‌కు ఘనస్వాగతం