తుమ్మపాల: నిబంధనలు పాటించని క్వారీ వాహ నాలను సీజ్ చేస్తామని కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, క్వారీలు, లారీల యజమానుల అసోసియేషన్లతో రోడ్డు ప్రమాదాలపై స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్వారీ లారీల వల్ల దారుణమైన ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కో ల్పోయారని, అధిక లోడుతో వెళ్లి రైల్వే అండర్ బ్రి డ్జిని ఢీకొనడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ఇకముందు ఇటువంటివి జరిగితే వా హనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిబంధ నల ప్రకారం నడుచుకోకపోతే జిల్లాలో క్వారీ వాహనాలను పూర్తిగా నిలిపివేస్తామన్నారు. భారీ వాహనాలు నిబంధనల మేరకు మాత్రమే సరకులు తీసుకువెళ్లాలని, అధిక లోడు, మితిమీరిన వేగం అనుమతించబోమన్నారు. క్వారీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే పనిచేయాలన్నారు.
అధికారులే నియంత్రించాలి..
రాంబిల్లి నేవల్ బేస్, జాతీయ రహదారుల అధికారులు.. వారికి అవసరమైన మెటీరియల్ తీసుకుని అధిక లోడుతో వచ్చే వాహనాలను నియంత్రించాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి లేని మైనింగ్‌పై విజిలెన్స్ దాడులు నిర్వహించాలని గనులశాఖ అధికారులను ఆదేశించారు. అక్రమ మైనింగ్ సమాచారం అందించని క్షేత్ర స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు చెప్పారు. అధిక లోడు, అధిక వేగం, రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ, రవాణాశాఖ అధికారులకు ఆదేశించారు. తీసుకున్న చర్యలపై వారం రోజులలో నివేదిక సమర్పించాలన్నారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, డీఎస్పీ వి.మోహనరావు, ఆర్టీవో మనోహర్, పంచాయతీరాజ్ ఈఈ కె.వి.నాయుడు, మైన్స్ అండ్ జియా లజీ సహాయ సంచాలకుడు ఎం.శ్రీనివాసరావు, క్వారీలు, లారీల యజమానుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
అధిక లోడు, మితిమీరిన వేగానికి కళ్లెం
కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం