● కలెక్టర్ ఆదేశాలతో నరికించి తీసుకెళ్లిన ఫ్యాక్టరీ అధికారులు
దేవరాపల్లి: కొత్తపెంట రైతు రొంగలి వెంకటరావు నిప్పు పెట్టిన చెరకు పంటను కలెక్టర్ ఆదేశాలతో ఫ్యాక్టరీ సిబ్బంది బుధవారం నరికించుకొని తీసువెళ్లారు. కష్టపడి సాగు చేసిన చెరకు పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కలత చెందిన రైతు తన పంటకు తానే నిప్పు పెట్టుకున్న సంగతి విదితమే. కాలిన పంటను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ జాహ్నవి మిగిలిన పంటను నరికించి ఫ్యాక్టరీకి తరలించాలని గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సిబ్బందికి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాక్టరీ సిబ్బంది బుధవారం కూలీలను పెట్టి దగ్గరుండి నరికించి, కాలిపోగా మిగిలిన పంటను లారీలో ఫ్యాక్టరీకి తరలించారు. పంటకు సంబంధించి కటింగ్ ఆర్డర్‌ను సైతం బాధిత రైతు వెంకటరావు ఫ్యాక్టరీ వ్యవసాయ అధికారి కృష్ణమూర్తి అందజేశారు.