
గంజాయి కేసుల్లో నిందితుల ఆస్తుల జప్తు
● ఎస్పీలకు డీఐజీ ఆదేశం
సాక్షి, అనకాపల్లి: గంజాయి రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిందితుల ఆస్తుల జప్తు, డీ–అడిక్షన్ కార్యక్రమాలపై విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి శనివారం ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంజాయి రవాణాలో లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి త్వరితగతిన జప్తు చేయాలని ఆదేశించారు. గంజాయి వినియోగదారులను గుర్తించి, వారిని డీ–అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందిస్తున్నామన్నారు. పోక్సో కేసుల్లో బాధితులకు కలెక్టర్ల ద్వారా పరిహారం త్వరగా అందేటట్లు చర్యలు చేపట్టాలన్నారు.