కశింకోట : నూతలగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. క్లీనర్ గాయపడ్డాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం.. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా త్రిపురవానిపాలెం కూడలి వద్ద అవతలి రోడ్డుకు వెళ్లడానికి అకస్మాత్తుగా లారీని మలుపు తిప్పడంతో అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుకగా ఢీ కొంది. దీంతో వెనుక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి (62) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
క్లీనర్‌కు గాయాలు